ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ 5 గంటలకు జరగాల్సిన ఐసీసీ సమావేశం మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. . అయితే, బ్రీఫ్ సెషన్లో హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించాలని ఐసీసీ మరోసారి పాక్‌ను అడిగింది. దీంతో తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో డిసెంబర్ 7న మళ్లీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి.