మాస్ కా దాస్‌గా దూసుకుపోతున్న యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) పై.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విశ్వక్ నటించిన తాజా చిత్రం ‘ఓరి దేవుడా'(ori devuda) దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి రామ్ చరణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ప్రస్తుతం చరణ్ ఆర్సీ 15 షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దాంతో ఈవేడుకకు అటెండ్ అయ్యాడు చరణ్.
ఈ సందర్భంగా విశ్వక్ సేన్ పై ప్రశంసలు కురిపించారు చరణ్. ‘విశ్వక్సేన్ అంటే తెలియని వారుండరు. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్ కొట్టిన విశ్వక్‌కు గల్లీ గల్లీలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇక విశ్వక్ సేన్ పర్సనాలిటీకి తాను పెద్ద అభిమానినని చరణ్ చెప్పడం విశేషం. ఇచ్చిన మాట మీద నిలబడేవాళ్లంటే తనకు చాలా ఇష్టమని.. తనకు అలాంటి పేరు ఉంది.. మంచో, చెడో మాటిస్తే విశ్వక్ కూడా దానిపై నిలబడతాడని నేను విన్నాను.. ఇలాగే ఉండమని చెప్పాడు చరణ్.
అలాగే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ రజనీకాంత్, పవన్‌కల్యాణ్, చిరంజీవి లాంటి వాళ్లు ఆ స్థాయిలో ఉండడానికి.. వారి వ్యక్తిత్వమే కారణమని.. సినిమాలు హిట్ అవుతాయి.. ప్లాప్ అవుతాయి.. ఎల్లప్పుడూ సూపర్ స్టార్‌గా ఉండాలంటే నీ పర్సనాలిటీనే అక్కడికి తీసుకెళ్తుందని’ అన్నాడు. దాంతో చరణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే చరణ్ రాకతో ఓరి దేవుడా సినిమా పై మంచి హైప్ వచ్చింది. ఇక తమిళ్ ‘ఓ మై కడవులే’ సినిమాకు రీమేక్‌గా తెరెకెక్కిన ఈ సినిమాకు.. ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన అశ్వత్ మారిముత్తునే డైరెక్షన్ చేశారు. ఇందులో దేవుడిగా వెంకటేష్ నటించారు.