NZB: ఆర్మూర్ ఉన్నత పాఠశాలకు చెందిన భానుశ్రీ రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పీడీ బొజ్జ మల్లేష్ గౌడ్ తెలిపారు. గత నెలలో సుద్ధపల్లి గురుకుల పాఠశాలలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర పోటీలకు ఎంపికైంది. ఈ నెల 7 నుంచి 9 వరకు ఆర్మూర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరపున ఆడనుంది.