NLG: నల్గొండ జిల్లాకు చెందిన యువతి నిజానపల్లి రమ్య సైక్లింగ్లో జాతీయస్థాయిలో రాణిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటింది. తమది పేద కుటుంబమని, దాతలు ఎవరైనా ట్రాక్ సైకిల్ బహుకరించి ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటానని వెల్లడించింది.