ప్రభాస్ నటిస్తున్న మాసివ్ ప్రాజెక్ట్ సలార్ నుంచి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. కెజియఫ్ తర్వాత హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా సలార్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ అంచనాలను అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే ప్రశాంత్ నీల్ ‘సలార్’ను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇందులో మళయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడని మాత్రమే తెలుసు. కానీ విలన్‌గా నటిస్తున్నాడా లేదా అనే క్లారిటీ లేదు.
తాజాగా అక్టోబర్ 16న పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సలార్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘వరదరాజ మన్నార్’ అనే పాత్రలో కనిపించబోతున్నట్టు రివీల్ చేశారు. అయితే ఈ సినిమాలో జగపతిబాబు రాజమాన్నార్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పధ్వీరాజ్ కూడా వరదరాజ మన్నార్‌గా కనిపిస్తుండడంతో.. ఈ ఇద్దరు ఒకే బ్యాచ్ అని తెలుస్తోంది. ఇక ఈ లుక్ ఊరమాస్‌గా ఉంది.. కేజీఎఫ్ 2లో అధీర పాత్రలో నటించిన సంజయ్ దత్ గెటప్ లాగే.. పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ కూడా మాసివ్‌గా ఉంది.
ముక్కు, చెవులకు రింగులతో పాటు.. మెడలో భారీ కడాలు.. ముఖంపై గాటుతో మొత్తంగా ఊహకందని విధంగా ఉంది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా మాసివ్ ట్రీట్ ఇవ్వడం పక్కా అని అంటున్నారు. ఇక శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. కేజీయఫ్ కేజీఎఫ్ మేకర్స్ హోంబే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది.