Ex Minister Perni Nani : కాపు కులాన్ని పవన్… చంద్రబాబుకి తాకట్టు పెట్టేస్తున్నాడు..!
Perni Nani : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. నేడు పవన్.. మచిలీపట్నం వేధికగా జనసేన ఆవిర్భావ సభ నిర్వహించాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... పవన్ పై పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. పవన్... ఇప్పటంలో మాట్లాడినట్లే... మచిలీపట్నంలో మాట్లాడతారంటూ ఎద్దేవా చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. నేడు పవన్.. మచిలీపట్నం వేధికగా జనసేన ఆవిర్భావ సభ నిర్వహించాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… పవన్ పై పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. పవన్… ఇప్పటంలో మాట్లాడినట్లే… మచిలీపట్నంలో మాట్లాడతారంటూ ఎద్దేవా చేశారు.
ప్యాకేజీ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదు కానీ.. స్టార్ ప్యాకేజీ అంటే పవన్‌కు ఇష్టమని పేర్ని నాని తెలిపారు. బందర్లో జరిగే జనసేన సభ తస్మదియ దూషణ సభ మాత్రమేనని నాని తేల్చేశారు. జగన్‌ను బలపరిచే కాపు నాయకులని తిట్టడం చంద్రబాబును బలపరచడం కోసమేనని పేర్ని నాని అన్నారు. కాపు కులాన్ని, కులస్తులను చంద్రబాబుకు తాకట్టు పెట్టే ప్రయత్నం పవన్ చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు.
ఇదిలా ఉండగా….జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఆవిర్భావ సభ సందర్భంగా హైవేపై ర్యాలీలు, సభలు నిర్వహించడానికి అనుమతిని పోలీసులు నిరాకరించారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ఎస్పీ జాషువా తెలిపారు. హైవేపై వెళ్లే సామాన్య ప్రజానీకానికి, అత్యవసర సర్వీసులైన మెడికల్, ఫైర్, ఇతర వాహనాలకు ఎటువంటి అంతరాయం కలిగించవద్దని పోలీసులు జనసైనికులను కోరారు. పోలీసు అనుమతులకు విరుద్ధంగా ర్యాలీలు, బహిరంగ ప్రదర్శనలు నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.