SRD: నాణ్యమైన పాడి సంపద ఉండాలంటే పునరుత్పతికి యోగ్యమైన పాడి సంపద ఉండాలని ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి కార్యనిర్వహణ అధికారి డా. రాంజీ అన్నారు. బుధవారం సిర్గాపూర్ మండలం కడపల్లో ఉచిత పశు వైద్య శిభిరం నిర్వహించారు. ప్రభుత్వం పశు సంపద పెంచాలనే ఉద్దేశంతో లింగనిర్ధారణ వీర్యం అందుబాటులోకి తెచ్చిందన్నారు. దీంతో ఆడ దూడలు జన్మిస్తాయని పేర్కొన్నారు.