స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల వాడకంతో స్క్రీన్ టైమ్ పెరిగి కళ్లు పొడిబారటం, దురద, కళ్లు ఎర్రబడటం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. 20 నిమిషాల పాటు స్క్రీన్ వాడితే 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించాలి. ఇది కళ్లకు మంచి వ్యాయామం. కీర ముక్కలని కళ్లపై పెట్టుకోవాలి. గోరువెచ్చని నీటితో కళ్లపై కాపడం పెట్టుకోవాలి.