HYD: పాతబస్తీలోని మురుగునీటి సమస్యల పరిష్కారానికి జలమండలి కొత్త రోబోటిక్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. విజయనగర్ కాలనీ సెక్షన్ పరిధిలోని మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్ద డీ-సిల్టింగ్ పనులను జలమండలి MD అశోక్ రెడ్డి, హైడ్రాకమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీవర్ లైన్లలో ఏర్పడిన పూడికను తొలగించడానికి ఉపయోగపడుతుందన్నారు.