ELR: భీమడోలుకు చెందిన నాగభూషణం ఇటీవల విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన షాట్పుట్, జావలిన్ త్రో పోటీల్లో ప్రథమ, తృతీయ స్థానాలు సాధించాడు. ఈ సందర్భంగా మంగళవారం నాగభూషణం మాట్లాడుతూ.. జాతీయ క్రీడా స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరుతున్నారు.