ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా లాంటి గ్రేట్ బౌలర్‌ను ఎదుర్కొన్నానని తన మనవళ్లకు చెబుతానని వెల్లడించాడు. క్రికెట్ చరిత్రలోనే గ్రేట్ బౌలర్లలో ఒకడిగా బుమ్రా కెరీర్‌ను ముగిస్తాడు. అతన్ని ఎదురుకోవడం ఎంత సవాలుతో కూడుకున్నదో తాము చుస్తున్నామన్నాడు. తనతో ఆడటం బాగుంది అని పేర్కొన్నాడు.