ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రోహిత్, గిల్ తిరిగి జట్టులోకి రానుండటంతో జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్‌పై మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆడిలైడ్ టెస్టులో ఇప్పుడున్న ఓపెనింగ్ జోడీని మార్చవద్దని కోరాడు. రోహిత్ శర్మ నంబర్ 6వ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని సూచించాడు.