ఇటీవలె అయోధ్యలో చాలా గ్రాండ్‌గా ఆదిపురుష్ టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇక ఈ టీజర్ పై నెటిజన్స్, సినీ ప్రముఖులు, పొలిటీషయన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇదేం గ్రాఫిక్స్, ఇవేం విజువల్స్.. అసలు రాముడు, రావణుడి లుక్ ఏంటి.. ఇలాంటి ఎన్నో విమర్శలు చేశారు. మొత్తంగా ఒక నిమిషం 47 సెక్లన్ టీజర్‌తో ఆదిపురుష్ ఓ యానిమేటెడ్ సినిమా అని తేల్చేశారు.
ఈ నేపథ్యంలో.. మంచు విష్ణు కూడా ఆదిపురుష్ పై నెగిటివ్ కామెంట్స్ చేసినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. విష్ణు నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘జిన్నా’ అక్టోబర్ 21న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం విష్ణు ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా ఆదిపురుష్ టీజర్ గురించి విష్ణు ఏదేదో చెప్పాడనే చర్చ జరుగుతోంది. ‘ఆది పురుష్’ మేకర్స్ ప్రభాస్‌ని మోసం చేశారని.. టీజర్ చూసిన తర్వాతే అసలు విషయం అర్థమైందని.. ఆది పురుష్ విజువల్స్ కార్టూన్ సినిమాలా ఉందని.. ఆడియెన్స్‌ను మోసం చేయాలని చూస్తే.. రియాక్షన్ ఇలాగే ఉంటుందని.. విష్ణు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇక ఈ విషయం కాస్త మంచు విష్ణు దృష్టికి వెళ్లడంతో.. స్వయంగా తనే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ‘ఇదంతా ఫేక్ న్యూస్.. ఊహించినట్టుగానే.. జిన్నా రిలీజ్‌కి ముందు.. ఎవరో ఐటం రాజా ఆ ఫేక్ న్యూస్‌ను స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.. నా డార్లింగ్ ప్రభాస్ గురించి నేనెందుకు అలా మాట్లాడుతానని..’ ట్విట్టర్లో రాసుకొచ్చాడు విష్ణు. దాంతో ఆదిపురుష్-జిన్నా పై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని తేలిపోయింది.