ఆస్ట్రేలియా పీఎం ఎలెవెన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పీఎం ఎలెవెన్ 240 పరుగులకు ఆలౌటైంది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టీమిండియా బ్యాటర్లలో జైస్వాల్ 45, గిల్ 50, నితీశ్ రెడ్డి 42 పరుగులతో రాణించారు.