వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. 19 కేజీల కమర్షియల్ LPG సిలిండర్ ధరను రూ.16.5 మేర పెంచుతున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. దీంతో HYDలో వాణిజ్య సిలిండర్ ధర రూ.855కి చేరుకుంది. మరోవైపు విజయవాడలో రూ. 818.50గా ఉంది. కాగా.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం వరుసగా ఇది ఐదోసారి కావడం గమనార్హం.