»Moto G73 5g Phone Launched In India Market From March 16 On Flipkart
Moto G73: 5G ఫోన్ లాంచ్..మార్చి 16 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో
Moto సంస్థ నుంచి సరికొత్త G73 5G స్మార్ట్ ఫోన్ దేశీయ మార్కెట్లోకి వచ్చింది. 8GB RAM, 256GB సపోర్ట్, 50MP ప్రధాన కెమెరా, 8MP సెకండరీ కెమెరా ఉన్న ఈ ఫోన్ రూ.16,999కే లభించనుంది. మార్చి 16 నుంచి ఈ పోన్ పలు స్టోర్లతోపాటు అధికారిక వెబ్ సైట్ సహా ఫ్లిప్ కార్టు(Flipkart)లో ఆన్ లైన్లో అందుబాటులో ఉంటుంది.
మీరు మంచి 5జీ స్మార్ట్ ఫోన్ కోసం ఎదురుచుస్తాన్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే తాజాగా Moto G73 5G ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. అయితే ఈ పోన్ ధర, స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తగా ప్రారంభించబడిన Moto G73 5G ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల FHD+ IPS LCD డిస్ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో, సపోర్ట్ 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి. దీంతోపాటు 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, ముందు భాగంలో పంచ్-హోల్ కటౌట్‌ను కలిగి ఉంది. Dolby Atmosతో సెల్ఫీ షూటర్, స్టీరియో స్పీకర్లు కల్గి ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో అల్ట్రా పిక్సెల్ టెక్నాలజీతో 50MP ప్రధాన కెమెరా, 118-డిగ్రీల FoVతో 8MP సెకండరీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఇది పోర్ట్రెయిట్, మాక్రో షాట్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. Moto G73 5G స్మార్ట్ ఫోన్ 8GB RAM, 256GB అంతర్గత నిల్వతో అందుబాటులో ఉంది. MediaTek డైమెన్సిటీ 930 చిప్సెట్, Android 13 OS, 30W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో అందుబాటులో ఉంది.
దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌లో IP52 రేటింగ్ కూడా ఉంది. ఇది స్ప్లాష్ రెసిస్టెన్స్ నుంచి సెక్యూరిటీని అందిస్తుంది. ఫోన్‌ను సురక్షితంగా ఉంచడానికి సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తుంది. ఇందులో 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, NFC, GPS, USB టైప్-C వంటి సౌకర్యాలు ఈ పోన్లో ఉన్నాయి.
Moto G73 5G భారతదేశంలో రూ.18,999కి విడుదల చేయబడింది. అయితే డిస్కౌంట్ల తర్వాత ఆఫర్లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ 8GB+128GB వేరియంట్‌కు కేవలం రూ.16,999కే లభించనుంది. అందుబాటులో ఉన్న కొన్ని బ్యాంక్ ఆఫర్ల ద్వారా వినియోగదారులు మరింత అదనపు తగ్గింపులను పొందవచ్చు. ఈ ఫోన్ లూసెంట్ వైట్, మిడ్నైట్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇది దేశంలో మార్చి 16 నుండి కంపెనీ అధికారిక వెబ్సైట్, Flipkart, ఇతర రిటైల్ స్టోర్లతో సహా ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.