Best selling phones గతేడాది హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ఐఫోన్లు : రిపోర్ట్
Best selling smart phones గతేడాది అంటే 2022లో బెస్ట్ సెల్లింగ్ మొబైల్ ఫోన్లలో అత్యధికంగా ఐఫోన్లే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ ఫోన్స్ డేటాను కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ కి చెందిన ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం... టాప్-10 బెస్ట్ సెల్లింగ్ మొబైల్స్‌లో ఐఫోన్13 మెదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
Best selling smart phones గతేడాది అంటే 2022లో బెస్ట్ సెల్లింగ్ మొబైల్ ఫోన్లలో అత్యధికంగా ఐఫోన్లే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ ఫోన్స్ డేటాను కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ కి చెందిన ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం… టాప్-10 బెస్ట్ సెల్లింగ్ మొబైల్స్‌లో ఐఫోన్13 మెదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే ఐఫోన్13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు వరుసగా సెకండ్, థర్డ్ ప్లేస్ల్లో నిలిచాయి. ఐఫోన్13 ప్రో.. ఐదు, ఐఫోన్12.. ఆరు, ఐఫోన్14.. ఏడు, ఐఫోన్14 ప్రో… ఎనిమిది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్ ఎస్ఈ (2022) తొమ్మిది స్థానాల్లో నిలిచాయి. అంటే టాప్ టెన్‌లో ఎనిమిది ఐఫోన్లే ఉన్నాయి.
ఇక శామ్సంగ్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ13 ఫోర్త్ ప్లేస్ సంపాదించగా,
శామ్సంగ్ గెలాక్సీ ఏ03 పదో స్థానాన్ని సొంతం చేసుకుంది. 2022లో సూపర్ పాపులరైన ఈ 10 స్మార్ట్ఫోన్లు 2023లో మరింత ఫేమస్ అవుతాయని రిపోర్ట్ అభిప్రాయపడింది. ఎందుకంటే మొబైల్ కంపెనీలు ఫేమస్ అయిన వాటినే ఎక్కువగా అమ్మకాలు జరిపేందుకుచూస్తాయని తద్వారా ప్రజలు ఇతర మోడల్స్‌కి బదులుగా పాపులర్ అయిన వాటినే కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారని వివరించింది.