»Monkey Negotiates With Woman Takes Food To Return Her Phone
Viral Video: టూరిస్ట్ ఐఫోన్ లాక్కున్న మంకీ..చివరికి ఏమైందంటే
కోతి చేష్టలు అని ఊరికే అనలేదు. ఓ టూరిస్టు దగ్గరి నుంచి ఓ కోతి ఫోన్ లాక్కుంది. ఎంతకు ఇవ్వలేదు. అది తినడానికి పండ్లు ఇవ్వగానే ఫోన్ తిరిగి ఇచ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.
Monkey negotiates with woman, takes food to return her phone
Viral News: తీర్థ యాత్రల(Pilgrimages)కు వెళ్లినచోట లేదా ఏదైనా టూరిస్ట్(tourist) ప్రదేశాల్లో సేదా తీరుదామని ఫోన్ పక్కన పెట్టామా అంతే. దొంగల బాధ కాదు, కోతుల బాధ. దొంగిలించినా వెంబడించి పట్టుకోవచ్చేమో కానీ కోతులు(Monkeys) పట్టుకుపోతే అవి మళ్లి ఎలా తిరిగి వస్తాయో తెలియదు. గోడలపై దూకుతాయి, నానా కోతి చేష్టలు చేస్తాయి. ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇండోనేషియా(Indonesia)లోని బాలి(Bali) ప్రాంతంలో ఒక కోతి టూరిస్ట్‌ను టెన్షన్ పెట్టించింది. తన ఫోన్ లాక్కుని ఆటపట్టించింది. దాంతో చేసేది ఏం లేక దిక్కులు చూడడం మొదలు పెట్టాడు బాధితుడు.
బాలి టాప్ హాలిడే అనే ట్రావెల్ ఏజెన్సీకి చెందిన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు. టూరిస్ట్ యాపిల్ ఫోన్‌ను తీసుకొని దగ్గర పెట్టుకుంది కోతి. దీంతో అక్కడ ఉన్న ఓ మహిళ తన బ్యాగ్‌లో ఉన్న తినుబండరాన్ని ఇవ్వజూపింది. దానికి కోతి వద్దన్నట్లు తల ఊపింది. వేరే ఒక పండును ఇచ్చింది. దాన్ని తీసుకున్న కోతి పండును నోట్లో పెట్టుకుంది. అయినా ఫోన్ ఇవ్వలేదు. ఇవి సరిపోదు అని బేరం ఆడుతున్నట్లు కనిపించింది. దీంతో మహిళ మరో పండును చేతికి ఇచ్చింది. అది తీసుకొని ఫోన్‌ను కింద పెట్టింది కోతి.
వెంటనే అక్కడనుంచి మొబైల్‌ను తీసుకొని సదరు టూరిస్ట్‌కు అందించింది. హమ్మయ్య అంటూ బాధితుడు ఫోన్‌ను టక్కున బ్యాగ్‌లో పెట్టుకున్నాడు. అక్కడితో కథ సుఖాంతం అయింది. దాదాపు 5 లక్షలకు పైగా చూసిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక అతను తన కొడుకు ఫోన్‌ను కూడా కోతి ఎత్తుకెళితే.. అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి తీసుకున్నామని అని కామెంట్ చేశాడు. దీనికి దాదాపు 2, 3 గంటల సమయం పట్టిందన్నారు. ఈ క్రమంలో టూరిస్ట్‌లు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.