ED Prepares 26 questions:కవిత కోసం 26 ప్రశ్నలతో ఈడీ రె‘ఢీ’
26 questions:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈ రోజు సీఎం కేసీఆర్ (cm kcr) తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ed) అధికారులు విచారించనున్నారు. విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని నిన్న సీఎం కేసీఆరే (cm kcr) స్వయంగా చెప్పారు కూడా.
26 questions:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈ రోజు సీఎం కేసీఆర్ (cm kcr) తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ed) అధికారులు విచారించనున్నారు. విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని నిన్న సీఎం కేసీఆరే (cm kcr) స్వయంగా చెప్పారు కూడా. లిక్కర్ స్కామ్‌లో (liquor scam) కవిత (kavitha) పాత్రపై ఈడీ అధికారులు (ed officials) ఇప్పటికే 26 ప్రశ్నలు (26 questions) సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
లిక్కర్ స్కామ్‌లో కవిత (kavitha) పాత్రపై ప్రశ్నలు కురిపించనున్నారు. మనీశ్ సిసోడియా (manish sisodia), లిక్కర్ వ్యాపారి రామచంద్ర పిళ్లైతో (ramachandra) కలిపి విచారిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు (gorantla buchibabu) గురించి, ఆయనే లిక్కర్ స్కామ్ పాలసీ రూపొందించారనే అంశం.. రామచంద్రా పిళ్లై గురించి, అతని వాంగ్మూలం ఇవ్వడం.. వెనక్కి తీసుకోవడం గురించి అడిగే ఛాన్స్ ఉంది. సౌత్ గ్రూపును కవిత (kavitha), మాగుంట రాఘవ (raghava) మెయింటెన్ చేశారట.. రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెల్లించారట.. ఇదే అంశంపై గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తారని తెలిసింది.
మరో వైపు ఢిల్లీలో గల ఈడీ కార్యాలయానికి కవిత (kavitha) తన లాయర్‌తో కలిసి వెళతారు. అక్కడ కేంద్ర బలగాలతో భద్రతను మొహరించారు. 144 సెక్షన్ కూడా విధించారు. ఆ పరిసర ప్రాంతాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత (Kavitha) మెడకు చుట్టు బిగుస్తోంది. ఇప్పటికే ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును (gorantla buchibabu) అరెస్ట్ చేశారు. ఆయన ఇటీవలే తీహార్ జైలు నుంచి ఇటీవలే షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చారు. మరో అనుచరుడు రామచంద్రా పిళ్లైను (ramachandra) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతను కవిత ప్రతినిధిని అని ఈడీ అధికారులకు (ed officials) చెప్పారట. తర్వాత మాట మార్చిన సంగతి తెలిసిందే. దీంతో లిక్కర్ స్కామ్‌లో కవిత (Kavitha) అరెస్ట్ తప్పదని తెలుస్తోంది.