TG: కుమారుడిని డిప్లొమా కోర్సులో చేర్చిన తల్లి.. తానూ ఎందుకు నేర్చుకోకూడదని.. అదే క్లాసులో అడ్మిషన్ తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామంలో 38 ఏళ్ల జక్కుల స్వర్ణలతకు ఇంటర్ చదివే సమయంలో పెళ్లైంది. తర్వాత భర్త ప్రోత్సాహకంతో దూరవిద్యలో డిగ్రీ, PG చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడితో కలిసి.. ITIలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులో చేరారు.