అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ దేశాలు అంతర్జాతీయ మారక కరెన్సీగా అమెరికా డాలర్ స్థానంలో కొత్త కరెన్సీని సృష్టించినా, వేరే కరెన్సీని స్వీకరించినా ఆ దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా డాలర్‌నే ఉపయోగిస్తామని బ్రిక్స్ దేశాల హామీ కావాలని తెలిపారు. లేదంటే, ఆ దేశాలు అమెరికా మార్కెట్లో అమ్మకాలను నిలిపేసుకోవాలని పేర్కొన్నారు.