»Telangana High Court Orders Cbi Not To Arrest Avinash Reddy Till Monday
Avinash reddyని సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దు.. సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశం
Avinash reddy:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి కాస్త ఊరట కలిగింది. ఈ కేసులో ఇప్పటికే ఆయనను పలుమార్లు సీబీఐ విచారించింది. అయితే ఈ రోజు కూడా విచారించాల్సి ఉంది. ఇంతలో సీబీఐ అధికారుల తీరు గురించి అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించి సోమవారం వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని సీబీఐ అధికారులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
Telangana High Court orders CBI not to arrest Avinash reddy till Monday
Avinash reddy:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (viveka) హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి (avinash reddy) కాస్త ఊరట కలిగింది. ఈ కేసులో ఇప్పటికే ఆయనను పలుమార్లు సీబీఐ (cbi) విచారించింది. అయితే ఈ రోజు కూడా విచారించాల్సి ఉంది. ఇంతలో సీబీఐ అధికారుల తీరు గురించి అవినాష్ రెడ్డి (avinash reddy) హైకోర్టులో (high court) పిటిషన్ వేశారు. దానికి సంబంధించి సోమవారం వరకు ఆయనను అరెస్ట్ (arrest) చేయొద్దని సీబీఐ (cbi) అధికారులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఈ రోజు సీబీఐ సుధీర్ఘంగా విచారిచింది. 5 గంటలపాటు వివిధ అంశాలపై ప్రశ్నించింది. వివేకా హత్య జరిగిన చోట దొరికిన లెటర్ కీలక సాక్ష్యం అని అవినాష్ అంటున్నారు. ఆ లేఖను సునీత భర్త రాజశేఖర్ దాచారని అవినాశ్ ఆరోపించారు. హత్య జరిగిన మధ్యాహ్నం వరకు ఎవరికీ ఇవ్వలేదని.. అలాగే గుండెపోటుతో చనిపోయారని తాను చెప్పలేదన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేసిందని చెప్పారు. ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగిందని అవినాష్ అన్నారు. నిందితులతో సీబీఐ కుమ్మక్కైందని.. సునీతకు లీకులు ఇస్తోందని చెప్పారు. 2006 నుంచి వివేకాకు ఓ మహిళతో సంబంధం ఉంది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు పేరు మార్చుకున్నారు. వారికి షేక్ షహన్ షా అనే అబ్బాయి పుట్టాడని చెప్పాడు. వివేకా హత్య తర్వాత డాక్యుమెంట్ల కోసం కొందరు వెతికారని అవినాశ్ అంటున్నారు. మరోవైపు అవినాశ్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆడియో, వీడియో క్లిప్పింగ్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. సోమవారం ఇవ్వాలని.. కేసులో అవినాశ్ నిందితుడా, సాక్షి అని కోర్టు అడిగింది. టెక్నికల్‌గా సాక్షి.. అని అవసరమైతే అరెస్ట్ చేస్తామని చెప్పగా.. సోమవారం వరకు చేయొద్దని స్పష్టంచేసింది. కేసుకు సంబంధించి పూర్తి సమాచారం సోమవారం టేబుల్ వద్ద ఉంచాలని కోరింది. అవసరమైతే మంగళవారం తిరిగి విచారించాలని కోరింది.
వైఎస్ వివేకా (ys viveka) హత్య కేసులో అవినాష్ రెడ్డిని (avinash reddy) ఇప్పటికే పలుమార్లు సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. విచారణను ఆడియో (audio), వీడియో రికార్డింగ్ (video recording) చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లాయర్ (lawyer) సమక్షంలో విచారణ జరిగేలా చూడాలని కోరారు. సీబీఐ తనకు 150 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిందని.. ఆ నోటీసుల ప్రకారం తనను అరెస్ట్ చేయకూడదని సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు హైకోర్టు (high court) ఆదేశాలు ఇచ్చింది. సోమవారం వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని సీబీఐకి స్పష్టంచేసింది.
అవినాష్ రెడ్డి తండ్రి భాష్కర్ రెడ్డిని (bhaskar reddy) ఈ నెల 12వ తేదీన విచారిస్తామని సీబీఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు కడప సెంట్రల్ జైలు (Kadapa Central Jail)లోని అతిథిగృహానికి విచారణకు రావాలని పేర్కొంది. ఇటీవల పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్‌ను (sudhakar) విచారించారు. ఎంపీ అవినాష్‌రెడ్డితో (avinash reddy) ఫోటో దిగిన విషయంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు వివేకా ఇంటికి వచ్చిన వారిలో కొందరిని సీబీఐ విచారణకు పిలిచింది. వివేకా (viveka murder case) హత్య కేసులో ఇప్పటికే సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి (krishna mohan reddy), జగన్ భార్య భారతి (bharathi) పీఏ నవీన్ (naveen) విచారించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా భాస్కర్ రెడ్డిని (bhaskar reddy) సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.