అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’. డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘దర్శకుడు సుకుమార్‌తో నాది 20 ఏళ్ల ప్రయాణం. ఆయన నా జీవితంలో చాలా మార్పు తీసుకొచ్చారు. ఈ చిత్రం ఎంత వసూళ్లు చేస్తుందన్న దాని గురించి మేం ఎప్పుడూ ఆలోచించలేదు. ‘పుష్ప 2′ కూడా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పుకొచ్చాడు.