NTR : ఈ ఏడాది ఎన్టీఆర్ నుంచి కొత్త సినిమా వచ్చే ఛాన్సే లేదు. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఎన్టీఆర్ 30 నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. కానీ ఓ వారం రోజుల పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయబోతున్నారు. మార్చి 12న ఆస్కార్ అవార్డ్ అందుకోబోతోంది ట్రిపుల్ ఆర్ టీమ్.
ఈ ఏడాది ఎన్టీఆర్ నుంచి కొత్త సినిమా వచ్చే ఛాన్సే లేదు. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఎన్టీఆర్ 30 నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. కానీ ఓ వారం రోజుల పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయబోతున్నారు. మార్చి 12న ఆస్కార్ అవార్డ్ అందుకోబోతోంది ట్రిపుల్ ఆర్ టీమ్. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ రావడం పక్కా. ఇక ఆస్కార్ అందుకున్న తర్వాత.. వెంటనే ఇండియాకి రిటర్న్ కానున్నాడు తారక్. వచ్చిన వెంటనే ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నాడు. మార్చి 18న ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. అయితే ఆ వెంటనే విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడు ఎన్టీఆర్. విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ మార్చి 22న రిలీజ్ కానుంది. ముందుగా మార్చి 17న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు 19వ తేదీన ధమ్కీ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్.. విశ్వక్ సేన్‌కు మాటిచ్చేశాడని అంటున్నారు. కాబట్టి.. ఎన్టీఆర్ 30 లాంచింగ్ తర్వాత ‘ధమ్కీ’ ఈవెంట్లో ఫ్యాన్స్‌ను కలవబోతున్నాడు తారక్. ప్రస్తుతం యంగ్ టైగర్ అమెరికాలో ఆస్కార్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇంకో రెండు రోజుల్లో నాటు నాటు ఆస్కార్ భవితవ్యం తేలిపోనుంది. ఆస్కార్ రెడ్ కార్పెట్ పై ఆర్ఆర్ఆర్ నటులుగా కాకుండా.. భారతీయులుగా ఎంతో గర్వంగా ఫీల్ అవుతామని, గుండెల్లో మన దేశాన్ని పెట్టుకొని గర్వంగా నడుస్తానని చెబుతున్నాడు ఎన్టీఆర్. దాంతో యావత్ ప్రపంచం మొత్తం ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తోంది.