»Another Inter Student Murder At Balapur Police Station Limits
మరో Inter విద్యార్థి దారుణహత్య.. ప్రేమ వ్యవహారమే కారణం
యువతిని ప్రేమించాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆ యువతితో ప్రేమ వ్యవహారం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. విషయం తెలుసుకున్న అర్షియా సోదరుడు, బాబాయ్ లు పవన్ పై దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ప్రేమ వ్యవహారంలో ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ సంచలన హత్య కేసును మరువకముందే హైదరాబాద్ లో మరో దారుణ హత్య చోటుచేసుకుంది. అర్ధరాత్రి బహిర్భూమికి వెళ్లిన ఇంటర్ విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు దారుణ హత్యకు పాల్పడ్డారు. వరుస హత్యలతో హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. తాజా సంఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ (Rachakonda Police Commissionerate) పరిధిలో బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా (RangaReddy District) ఆమన్ గల్ (Amangal) మండలం కేస్లీ తండాకు చెందిన డెగావత్ పవన్ (18) (Degavath Pavan) బాలాపూర్ పోలీస్ స్టేషన్ (Balapur Police Station) పరిధిలోని వాదే ఉమర్ లో ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం రాత్రి పవన్ బాత్రూమ్ కోసం బయటకు రాగా అప్పటికే కాచుకుని ఉన్న గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడులు చేశారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన పవన్ వెంటనే కేకలు వేశాడు. కేకలు విన్న కుటుంబసభ్యులు వెంటనే వచ్చి చూడగా రక్తపు మడుగులో అచేతనావస్థలో కనిపించాడు. హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు (Telangana Police) ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ అంజయ్య క్లూస్ టీమ్ ఆధారంగా హత్యకు గల కారణాలు తెలుసుకున్నారు.
కాగా ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తున్నది. పవన్ అర్షియా అనే యువతిని ప్రేమించాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆ యువతితో ప్రేమ వ్యవహారం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. విషయం తెలుసుకున్న అర్షియా సోదరుడు, బాబాయ్ లు పవన్ పై దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. హత్యకు పాల్పడిన అనంతరం నిందితులు పరారయ్యారు.