»Instagram Outage Resolved And Company Sayes Its Technical Issue
Instagram Outage ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. మీమ్స్ పండుగ
తెల్లవారుజామున మా సేవలకు అంతరాయం ఏర్పడిందనే ఫిర్యాదులు వచ్చాయి. సాంకేతిక కారణాలతో ఆ సమస్య వచ్చింది. వీలైనంత త్వరగా అందరి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. సేవల అంతరాయానికి చింతిస్తున్నాం’ అని ఇన్ స్టాగ్రామ్ పీఆర్ టీమ్ ప్రకటించింది.
సాంకేతిక లోపం (Technical Issue) తో దిగ్గజ సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ (Instagram) స్తంభించింది. చాలా సేపు వరకు సేవలకు అంతరాయం ( ఏర్పడింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారతదేశం (India)తోపాటు ప్రపంచవ్యాప్తం (Worldwide)గా ఈ సమస్య ఎదురైంది. ఫొటోలు చూడడం.. కంటెంట్ పోస్టు చేయడం.. యాప్ (App) ఫీచర్లను యాక్సెస్ చేయడానికి అంతరాయం (Outage) ఏర్పడింది. దీనిపై వేల సంఖ్యలో ఫిర్యాదు (Complaints)లు వచ్చాయి. అయితే వెంటనే పునరుద్ధరణ (Resolve) చర్యలు చేపట్టడంతో సేవలు యథావిధిగా కొనసాగాయి.
మార్చి 9 గురువారం రోజున అమెరికా (US)లో 46 వేల మంది, యూకే (UK) 2 వేలు, భారత్, ఆస్ట్రేలియ నుంచి వెయ్యి కంటే అధిక ఫిర్యాదు అందాయని తెలుస్తున్నది. భారత కాలమాన ప్రకారం ఉదయం 7 గంటల సమయంలో ఇన్ స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అయితే సేవల అంతరాయానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు. సేవల అంతరాయంపై ఇన్ స్ట్రాగ్రామ్ అధికారికంగా స్పందించింది. సాంకేతిక సమస్యతోనే తమ సేవలు స్తంభించాయని పేర్కొంది.
‘తెల్లవారుజామున మా సేవలకు అంతరాయం ఏర్పడిందనే ఫిర్యాదులు వచ్చాయి. సాంకేతిక కారణాలతో ఆ సమస్య వచ్చింది. వీలైనంత త్వరగా అందరి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. సేవల అంతరాయానికి చింతిస్తున్నాం’ అని ఇన్ స్టాగ్రామ్ పీఆర్ టీమ్ ప్రకటించింది. కాగా గతేడాది సెప్టెంబర్ నెలలో కూడా ఇలాంటి సమస్య వచ్చిన విషయం తెలిసిందే. మొన్న ట్విటర్ నేడు ఇన్ స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడడం ఐటీలో చర్చనీయాంశమైంది. ఇక ఇన్ స్టాగ్రామ్ సేవల అంతరాయంపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ మీమ్స్ మామూలుగా లేవు. మీమర్స్ ఒక ఆట ఆడేసుకున్నారు.