»Ind Vs Aus Fourth Starts In Ahmedabad Ashwin Dismisses Head
IndVsAus ఇద్దరు ప్రధానుల సమక్షంలో నాలుగో టెస్ట్ మొదలు
ప్రపంచంలోనే అతి పెద్దదైన అహ్మదాబాద్ స్టేడియం (Narendra Modi Stadium) విశేషాలను రవిశాస్త్రి (Ravi Shastri) వివరించారు. ఈ టెస్ట్ మ్యాచ్ కు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో స్టేడియం కళకళలాడింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో భాగంగా రెండు టెస్టులు (Test Matches) గెలిచి జోరు మీదున్న భారత్ (India)ను మూడో టెస్టులో ఆస్ట్రేలియా (Australia) చిత్తు చేసింది. దీంతో భారత్ ఇరకాటంలో పడింది. కచ్చితంగా గెలువాల్సిన నాలుగో టెస్ట్ (Fourth Test Match) మ్యాచ్ అహ్మదాబాద్ లో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. టెస్టు ప్రారంభానికి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని (Anthony Albanese), భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. వీరిద్దరి సమక్షంలో నాలుగో టెస్టు మొదలవగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలుపెట్టింది.
కాగా ఈ మ్యాచ్ కు భారత్-ఆస్ట్రేలియా మధ్య 75 స్నేహానికి గుర్తుగా ఆ ఇద్దరు ప్రధానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు స్టేడియంలో కలియ తిరిగారు. వారిద్దరికి బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రత్యేక జ్ణాపికలను అందించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన అహ్మదాబాద్ స్టేడియం (Narendra Modi Stadium) విశేషాలను రవిశాస్త్రి (Ravi Shastri) వివరించారు. ఈ టెస్ట్ మ్యాచ్ కు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో స్టేడియం కళకళలాడింది.
అనంతరం టాస్ (Toss) వేయగా ఆస్ట్రేలియా టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగింది. పిచ్ తొలుత బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందనే భావనతో కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ లో భారత్ బరిలో నిలవాలంటే ఈ టెస్టు మ్యాచ్ లో తప్పనిసరిగా గెలువాల్సిందే. చావోరేవో అన్నట్టు ఉన్న ఈ మ్యాచ్ ను గెలవాలని పట్టుదలతో భారత సేన ఉంది. ఇప్పటికే రెండు విజయాలు, ఒక ఓటమితో ఉన్న భారత్ నాలుగో టెస్టును కైవసం చేసుకుని సిరీస్ తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగింది.
భారత జట్టు (Indian Team)
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్
ఆస్ట్రేలియా (Australia Team)
ట్రావిడ్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), పీటర్ హ్యాండ్స్ కాంబ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, మ్యాథ్యూ కునెమన్, నాథన్ లయన్.