Pawan Kalyan : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జెస్ట్ అవక.. క్రిష్, హరీష్ శంకర్, సుజీత్ లాంటి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే హరీష్ శంకర్ ఇంకా సినిమాను మొదలు పెట్టలేదు.. కానీ క్రిష్ పరిస్థితే చెప్పుకోకుండా ఉంది. అసలు ఇప్పట్లో హరిహర వీరమల్లు కంప్లీట్ అవుతుందా..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జెస్ట్ అవక.. క్రిష్, హరీష్ శంకర్, సుజీత్ లాంటి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే హరీష్ శంకర్ ఇంకా సినిమాను మొదలు పెట్టలేదు.. కానీ క్రిష్ పరిస్థితే చెప్పుకోకుండా ఉంది. అసలు ఇప్పట్లో హరిహర వీరమల్లు కంప్లీట్ అవుతుందా.. పవన్ ఈ సినిమాను పక్కకు పెట్టేశాడా.. అనే డౌట్స్ రాక మానదు. అలాగే హరీష్ శంకర్ కూడా తన సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి.. ఇంకా వెయిటింగ్ మోడ్‌లోనే ఉన్నాడు. కానీ సెట్స్ పైకి తీసుకెళ్లడమే ఆలస్యమన్నట్టు.. వినోదయ సీతం మాత్రం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఇటీవలె ఈ సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పవన్ నెల రోజులు కాల్షీట్స్ మాత్రమే ఇచ్చారట. అందుకే వీలైనంత త్వరగా పవన్ పార్ట్‌ను కంప్లీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. హీరోయిన్లుగా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ‘దేవుడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ దేవుడిగా కనిపించబోతున్నాడు. అందుకే ‘దేవుడు’ బాగుంటుందని భావిస్తున్నారట. గతంలో బాలయ్య నుంచి ఇదే టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది. పైగా పవర్ స్టార్‌ను పవర్ స్టార్ సైన్యం తమ అభిమాన దేవుడిగా భావిస్తుంటారు. దాంతో ఇదే టైటిల్ ఫిక్స్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోగానే ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్‌ను మొదలు పెట్టబోతున్నారు పవన్. ఏప్రిల్‌లో ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. కానీ హరిహర వీరమల్లు పరిస్థితి అర్థం కాకుండా పోతోంది.