తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని అడవి శేష్, మృణాల్ ఠాకూర్ దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యత, రుచి బాగుందని చెప్పారు. మొదటిసారిగా స్వామివారి దర్శనానికి వచ్చానని మృణాల్ ఠాకూర్ తెలిపారు. ‘డెకాయిట్’ చిత్రం ప్రేక్షకాదరణ పొందాలని ప్రార్థించామని పేర్కొన్నారు.