సినిమా విడుదలకు ముందే ఆదిపురుష్ మూవీకి మరో షాకింగ్ న్యూస్ తగిలింది. ఈ చిత్ర బృందానికి, హీరో ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపించింది. పిటిషన్ దారుల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది.
హిందూవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ చిత్రంలో… రాముడు, సీత, హనుమంతుడు, రావణుడి పాత్రలను అసంబద్ధంగా చూపించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి ఆదిపురుష్‌లో సీన్లను పలువురు తెగ ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం బిగ్ స్క్రీన్ కోసం తీశామని..ఈ మూవీ థియేటర్లలో నచ్చుతుందని..డైరెక్టర్ ఓం రౌత్ చెబుతున్నారు.