టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్టీ మారబోతున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఆయన త్వరలోనే బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఏపీలో తన బలం పెంచుకోవాలని బీజేపీ ఎప్పటి నుంచో చూస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పార్టీ కి ఏపీలో సరైన నాయకులు ఎక్కువ మంది లేరనే చెప్పాలి. అందుకే.. ఈ సారి ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా… పోటీకి తలపడాలి అంటే..కచ్చితంగా నాయకులు అవసరం. అందుకే.. బలగం పెంచుకునేందుకు సీనియర్ నాయకులను ఆకర్షించే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాయపాటిని ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాయపాటి టీడీపీలో కొనసాగుతున్నారు. కానీ…. ఆయనను టీడీపీ పట్టించుకోవడం లేదని.. ఆయన మద్దుతుదారులు కూడా వాపోతున్నారు. ఎందుకంటే.. మహానాడుకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడు రంగారావుకు.. సత్తెనపల్లి టికెట్ కోరుతున్నారు. తనకు నరసారావుపేట ఎంపీ టికెట్ అడుగుతున్నారు అయితే.. రాయపాటి కుటుంబానికి ఏదో ఒకటే ఇస్తామని..నిన్న మొన్నటి వరకు కూడా.. టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే.. ఇప్పడు ఏదీ ఇచ్చేది లేదని..అంటున్నారని.. రాయపాటి వర్గంలో గుసగుస వినిపిస్తోంది.
ఇటీవల రాయపాటి.. టీడీపీపై జోస్యం చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. టీడీపీ 125 స్థానాల్లో విజయం దక్కించుకుంటుందని అన్నారు. అంతేకాదు.. ఒంటరిగా పోటీ చేసినా.. ఇదే ఫలితం వస్తుందని అన్నారు. అయితే.. దీనిపై టీడీపీ నేతలు ఒక్కరంటే.. ఒక్కరు కూడా స్పందించలేదు. దీంతో మానసికంగా.. ఒకింత ఇబ్బంది పడిన రాయపాటి.. టీడీపీ అనుకూల మీడియా కూడా.. తనను దూరం పెట్టిందని.. వాపోయారు. ట్వీట్టర్ వేదికగా.. ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీలోకి వెళితే.. తనకు అధికారం దక్కుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఎంతరకు నిజం ఉందో.. కొద్ది రోజులు ఆగితేకానీ తెలియదు