»Revanth Reddy Said Charge Sheet On Minister Ktr And Santosh Kumar In Jail Sircilla
Revanth Reddy: మంత్రి KTRపై ఛార్జ్ షీట్..సంతోష్ ను జైళ్లో పెట్టాలి
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(ktr)పై కాంగ్రెస్ పార్టీ ఛార్జీ షీట్(Charge sheet) విడుదల చేసింది. సిరిసిల్లా(sircilla) జిల్లా తంగళ్లపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ(congress party) యాత్రలో రేవంత్ రెడ్డి(revanth reddy)తోపాటు కేకే మహేందర్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్(ktr) ఇచ్చిన హామీలతోపాటు పలు అవినీతి ఆరోపణల గురించి రేవంత్ ప్రశ్నించారు.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(ktr)పై కాంగ్రెస్ పార్టీ ఛార్జీ షీట్(Charge sheet )విడుదల చేసింది. సిరిసిల్లా జిల్లా(sircilla district) తంగళ్లపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy)తోపాటు కేకే మహేందర్ రెడ్డి సహా పలువురు పాల్గొన్న క్రమంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేకే మహేందర్ రెడ్డికి గతంలో సీటు ఇవ్వకుండా కేటీఆర్ అన్యాయం చేశారని రేవంత్ అన్నారు. మరోవైపు ఇక్కడి నుంచి సిద్ధిపేట ప్రాంతానికి నీళ్లు తీసుకుపోయిండు కానీ..సిరిసిల్లలో 9వ ప్యాకేజీ కట్టలేదని గుర్తు చేశారు. డ్రామారావు అవినీతి కారణంగా 9వ ప్యాకేజీ బలి అయిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇప్పుడు ఎన్నికలు రాగానే సిరిసిల్లా నియోజకవర్గంలో డ్రామారావు పర్యటిస్తున్నాడని.. అసలు గతంలో ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నాడా అని రేవంత్ ప్రశ్నించారు.
మానేరు డ్యాంలో ఇసుక దోపిడీకి పాల్పడిన జోగిని పల్లి సంతోష్(Santosh kumar) ను జైళ్లో పెట్టాలని రేవంత్ రెడ్డి(revanth reddy) డిమాండ్ చేశారు. మరోవైపు నెరేళ్ల గ్రామ దళితులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ నివేదికను బయటపెట్టాలని కోరారు. ఇంకోవైపు మ్యాక్స్ సోసైటీల పేరుతో బతుకమ్మ చీరలు(bathukamma sarees) ఇచ్చి కంట్రాక్టర్లు తీసుకుని కమిషన్లు ఇచ్చినవారికే పనులు ఇచ్చారని ఆరోపించారు. ఈ క్రమంలో సిరిసిల్లలో అనేక మందికి పని ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇక డబుల్ బెడ్ రూం ఇళ్ల(double bed room houses) కేటాయింపుల్లో పలువురు లబ్ధిదారుల నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ప్రతి మండలానికి 30 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని చెప్పిన హామీ ఏమైందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మంత్రి కేటీఆర్(ktr) అసమర్థ పాలన కారణంగా సిరిసిల్ల ప్రాంతానికి మెడికల్ కాలేజీ(medical college) కూడా రాలేదన్నారు. మరోవైపు మంత్రికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు ఔషదాలను ప్రైవేటులో అమ్ముకునేందుకు అనుమతి ఇస్తున్నారని విమర్శించారు. సిరిసిల్ల(sircilla) నుంచి కామారెడ్డి వరకు 4 లైన్ల రోడ్డు(four line road) వేస్తామని చెప్పిన హామీ ఎక్కడ అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ అండదండలతో మున్సిపల్ ఛైర్మన్ భర్త ఈ నియోజకవర్గంలో కోట్ల విలువైన భూములను ఆక్రమించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిపై ఛార్జీ షీట్ దాఖలు చేయాలని అన్నారు.