»20 Thousand Crore For Road Development In Ap Nitin Gadkari
Nitin Gadkari: ఏపీలో రోడ్ల కోసం రూ.20 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్(ap) రాష్ట్రానికి పెట్టుబడల వెల్లువ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయని ఏపీ సీఎం జగన్(cm jagan) తెలిపారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ఏపీకి 20 వేల కోట్ల రూపాయలు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడల వెల్లువ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయని ఏపీ(ap) సీఎం జగన్(cm jagan) తెలిపారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ఏపీకి 20 వేల కోట్ల రూపాయలు ప్రకటించారు. ఈ నిధులను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్ల కనెక్టివిటీ కోసం ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని రాహదారులను మరింత అభివృద్ధి చేయనున్నట్లు గుర్తు చేశారు. మరోవైపు ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు(industrial corridors) ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు.
నరేంద్ర మోదీ(narendra modi) ప్రధాని అయిన తర్వాత దేశంలో రహదారుల అభివృద్ధి మరింత స్పీడుగా జరుగుతుందని గడ్కరీ(Gadkari) అన్నారు. ఇంకోవైపు దేశంలో ప్రధానమైన రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటని పేర్కొన్నారు. ఈ క్రమంలో సరకు రవాణా ఖర్చులను తగ్గించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం(ap government) స్థలం కేటాయిస్తే తిరుపతి(tirupati)లో ఇంట్రా మోడల్ బస్ పోర్ట్ ఏర్పాటు చేస్తామని గడ్కరీ చెప్పారు. దీంతోపాటు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు కూడా ఏర్పాటు చేసి పోర్టులకు రోడ్లను అనుసంధానం చేస్తామన్నారు. ఈ క్రమంలో ఏపీలో ఆర్టీసీ(apsrtc) ఛార్జీలను తగ్గించి ప్రజా రవాణాను ప్రోత్సహించాలని గడ్కరీ కోరారు.
విశాఖపట్నం(visakhapatnam)లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023(global investors summit 2023)కు నితిన్ గడ్కరీ(Nitin Gadkari) హాజరైన సందర్భంగా ప్రకటించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. ప్రభుత్వం గుర్తించిన 14 కీలక రంగాల్లో ఆంధ్రప్రదేశ్(ap)లో పెట్టుబడుల కోసం 30కి పైగా స్టాల్స్‌తో సహా దాదాపు 200 స్టాల్స్(stalls)ను ఏర్పాటు చేశారు. ఇండియా, చైనా(china), USA సహా 40 ఇతర దేశాల నుంచి 8,000 మంది ప్రముఖులు, పెట్టుబడిదారులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.