WGL: నర్సంపేట నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ పేద విద్యార్థులకు స్థానికంగానే కార్పొరేట్ స్థాయి విద్య కోసం 10 గురుకులాలు, సైనిక్ స్కూల్, మెడికల్ కళాశాల ఏర్పాటు చేశామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. నేడు ఆ గురుకులాల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. CM స్పందించాలని ఆయన అన్నారు.