ELR: జిల్లాలో వివిధ కారణాల వల్ల పెన్షన్ తీసుకోని వారికి ఈ నెల మూడో తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో తేదీన తీసుకోని వారికి రెండో తేదీన అందించామని, ఇంకా మిగిలిపోయిన లబ్ధిదారులకు బుధవారం పెన్షన్ సొమ్ము అందజేస్తామన్నారు. కావున పెన్షన్ రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు