»Viral Hyderabad Man Helicopter Used To Wedding Invitation
Helicopter హైదరాబాదోళ్ల పెళ్లంటే అట్లుంటది.. హెలీకాప్టర్ లో వెళ్లి పత్రికలు పంపిణీ
పెళ్లి వేడుకలకు హెలీకాప్టర్ల వినియోగం భారీగా పెరుగుతోంది. ఇతర ప్రాంతాల్లో హెలీకాప్టర్లు వధూవరులను తీసుకురావడానికి వినియోగించారు. ఇక వారిపై పూల వర్షం కురిపించేందుకు వాడారు. కానీ ఇలా పెళ్లి పిలుపుల కోసం హెలీకాప్టర్ వాడడం ఇదే మొదటిసారి కావొచ్చు. కాగా పెళ్లి కోసం హెలీకాప్టర్ వాడడం ఇదే తొలిసారి అయ్యిండొచ్చు. పెళ్లి పిలుపులకే ఇంత హడావుడి చేస్తున్న ఆ వ్యాపారి ఇక పెళ్లి నాడు ఎంత హడావుడి చేస్తున్నాడో ఊహించుకోవచ్చు.
వివాహం (Marriage) అంటే జీవితంలో ఒక్కసారి చేసుకునే అపురూపమైన వేడుక. బంధుమిత్రులు, కుటుంబసభ్యుల మధ్య అంగరంగ వైభవంగా చేసుకోవాలని అందరికీ ఉంటుంది. ప్రస్తుతం శుభకార్యాలకు అనువైన సమయం. శుభ ముహూర్తాలు ఉండడంతో పెద్ద ఎత్తున శుభకార్యాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad) మొత్తం పెళ్లి వాతావరణంతో నిండిపోయింది. అయితే హైదరాబాద్ లో పెళ్లంటే నానా హంగామా ఉంటుంది. ఎంత పేదవాడైనా తన స్థాయికి మించి పెళ్లి చేసుకుంటాడు. అదే సంపన్నులైతే కళ్లు మిరిమిట్లు గొలిపేలా.. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా చేసుకుంటారు. తాజాగా హైదరాబాద్ వ్యాపారి తన తమ్ముడి పెళ్లి కోసం మస్త్ ధూమ్ ధామ్ గా ఏర్పాట్లు చేశాడు. తన బంధుమిత్రులు, సుట్టాళ్లను పిలిచేందుకు ఏకంగా హెలీకాప్టర్ (Helicopter)నే తీసుకొచ్చిండి. తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న తమ బంధువులను పిలిచేందుకు హెలీకాప్టర్ వినియోగించాడు. ఈ వార్త కాస్త నెట్టింట్ల (Social Media) వైరల్ (Viral)గా మారింది.
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ (Khairatabad) ప్రాంతానికి చెందిన పాల వ్యాపారి మధు యాదవ్ (Madhu Yadav). దూద్ వాలా డెయిరీ (Doodwala Diary) నిర్వహిస్తుంటాడు. ఆయన తమ్ముడు చందు యాదవ్ (Chandu Yadav) వివాహం ఈనెల 9వ తేదీన జరుగనుంది. దీనికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ముంబైలో ఉన్న బంధువులు, మిత్రులకు పెళ్లి పత్రికలు పంచేందుకు ఓ హెలీకాప్టర్ ను అద్దె (Rent)కు తీసుకున్నాడు. పెళ్లికి సమయం తక్కువగా ఉండడంతో.. విమానం, రైళ్లు, బస్సుల్లో వెళ్తే పని కాదని భావించి ఏకంగా హెలీకాప్టర్ నే తీసుకున్నాడు. వారంలా అయ్యే పని ఒక్క రోజులో అవుతుండడంతో మధు యాదవ్ ఈ విధంగా చేశాడు.
కాగా పెళ్లి వేడుకలకు హెలీకాప్టర్ల వినియోగం భారీగా పెరుగుతోంది. ఇతర ప్రాంతాల్లో హెలీకాప్టర్లు వధూవరులను తీసుకురావడానికి వినియోగించారు. ఇక వారిపై పూల వర్షం కురిపించేందుకు వాడారు. కానీ ఇలా పెళ్లి పిలుపుల కోసం హెలీకాప్టర్ వాడడం ఇదే మొదటిసారి కావొచ్చు. కాగా పెళ్లి కోసం హెలీకాప్టర్ వాడడం ఇదే తొలిసారి అయ్యిండొచ్చు. పెళ్లి పిలుపులకే ఇంత హడావుడి చేస్తున్న ఆ వ్యాపారి ఇక పెళ్లి నాడు ఎంత హడావుడి చేస్తున్నాడో ఊహించుకోవచ్చు. అయితే తమ్ముడిపై ప్రేమతోనే మధు యాదవ్ ఇదంతా చేస్తున్నాడని తెలుస్తున్నది. హెలీకాప్టర్ పెళ్లి పిలుపు వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘అన్నదమ్ముల మధ్య ప్రేమ ఇలా ఉంటది’ అని కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు ‘నువ్వేంటి బ్రో డబ్బులు ఉన్నోడివి’ అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: Manchu Manoj రేపే మనోజ్ పెళ్లి.. మంచు వారి ఇంట్లో సందడి