PDPL: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరల పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర కోసం దశాబ్దాల పాటు ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు.