KRNL: IPLలో RCB విజయం సందర్భంగా కర్నూలులో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసిన ఘటనలో ఇవాళ 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్ మీడియా వీడియోలు తదితర సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజా ఆస్తుల ధ్వంసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు.