KDP: కొండాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం క్రాస్ వద్ద CI పి.రాజా, SI జయరాముడు ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, మహిళా భద్రత, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళలు ‘శక్తి’ యాప్ వినియోగించుకోవాలని సూచించారు.