NDL: ప్యాపిలి పట్టణంలో ఇవాళ డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పర్యటించారు. పట్టణంలో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకొని ఇటీవల కురిసిన వర్షాలకు ఆలయం పైకప్పు కూలిపోయింది. ఆలయం కూలిపోయిన ప్రదేశాన్ని ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు.