TG: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. లబ్దిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందని.. ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సొంత ఇల్లు సాకారమవుతుందని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని.. ఇబ్బందులు ఉన్నా మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.