»Cocaine Worth Rs 25 Crore Seized At Mumbai Chhatrapati Airport
Cocaine Seized: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.25 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.25 కోట్ల విలువైన 2.58 కిలోల కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్(drugs) అక్రమ రవాణా కట్టడి కోసం అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పలువురు కేటుగాళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పేస్ట్ రూపంలో, బిస్కెట్లు, లో దుస్తులు, విగ్గుల్లో ఇలా పలు రకాలుగా డ్రగ్స్ ను అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తూ దొరికిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం(Mumbai chhatrapati airport)లో దిగిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.25 కోట్ల విలువైన కొకైన్(Cocaine)ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం(seized) చేసుకున్నారు. సబ్బు మాదిరిగా ఉన్న కడ్డీల్లో దాచి ఉంచిన 2.58 కిలోల కొకైన్‌తోపాటు ఓ ప్రయాణికుడితోపాటు ఉన్న మరో అనుమానితుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సమాచారంపై నిన్న ముంబయి(Mumbai)లోని CSMA విమానాశ్రయంలో DRI అధికారులు ఓ ప్రయాణికుడిని అడ్డగించారు. ప్రయాణీకుడి సామానును క్షుణ్ణంగా శోధించడంతో 12 సబ్బు కడ్డీలలో దాచిపెట్టిన 2.58 కిలోల కొకైన్ అధికారులకు దొరికింది. ప్రయాణీకుడు(passenger) తన ట్రాలీ బ్యాగ్‌లో వాటిని తీసుకువెళుతున్న క్రమంలో అధికారులు పట్టుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI)కి చెందిన అధికారుల బృందం ఛత్రపతి శివాజీ మహారాజా ఇంటర్నేషనల్ (CSMI) విమానాశ్రయంలో నిఘా నిర్వహణలో భాగంగా ఈ డ్రగ్స్ గుట్టు తేలింది.