»Boy Pradeep Killed In Dog Attacked Ghmc Rs 10 Lakh Compensation To His Family
GHMC: కుక్కల దాడిలో బాలుడి మృతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం
భాగ్యనగరంలో ఇటీవల కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్ వార్త సంచలనంగా మారింది. అయితే ఈ బాలుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తాజాగా జీహెచ్ఎంసీ ప్రకటించింది. వీటిలో కార్పొరేటర్ల నెల జీతం నుంచి రూ.2 లక్షలు, మిగతావి జీహెచ్ఎంసీ నుంచి ఇస్తామని వెల్లడించింది.
ఇటీవల హైదరాబాద్ అంబర్ పేటలో కుక్కల దాడిలో మరణించిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి జీహెచ్ఎంసీ(ghmc) రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. జీహెచ్ఎంసీ తరఫున రూ.8 లక్షలు, కార్పొరేటర్ల నెల శాలరీ నుంచి మరో 2 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనపై తెలంగాణ(telangana) హైకోర్టు(highcourt) సుమోటో కేసుగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఆ క్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్(ghmc commissioner), హైదరాబాద్ కలెక్టర్ సహా పలువురు అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అసలు నగరంలో శునకాలు వీధుల్లో విచ్చల విడిగా తిరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరింది. ఆ బాలుడి కుటుంబానికి పరిహారం ఇచ్చే అంశంపై పరిశీలిస్తామని హైకోర్టు చెబుతూ విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.
హైదరాబాద్ లో అంబర్ పేట (Amber Peta)లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల (dogs)దాడి నుంచి తప్పించుకునేందుకు వీలు లేకపోవడంతో నిస్సాహాయంగా వాటికి బలయ్యాడు. ఒంటరిగా రావడమే బాలుడు చేసిన పాపమైంది. నాలుగేళ్ల చిన్నారిని వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. సెలవు (holiday) రోజు ఆదివారం తండ్రితో కలిసి వెళ్లిన బాలుడికి అదే చివరి రోజు అయింది. పని చేసే చోటుకు తండ్రి పిల్లలను వెంటపెట్టుకుని వెళ్లాడు. కాసేపు తండ్రి ఆదమరువడంతో వీధిలోకి వెళ్లిన చిన్నారి కుక్కలకు బలయ్యాడు.
కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు చిన్నారి తన శక్తి మేర ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. జంతువును వేటాడినట్టుగా కుక్కలన్నీ కలిసి చిన్నారిని అన్నివైపుల నుంచి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్ (nizamabad) జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ ( Gangadhar)నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ కు వలస వచ్చాడు. నగరంలోని అంబర్ పేట ‘చే నెంబర్’ చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నారు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్ తో కలిసి అంబర్ పేట ఎరుకుల బస్తీలో నివాసం ఉంటున్నారు. అయితే ఆదివారం సెలవు కావడంతో పిల్లలిద్దరినీ వెంటబెట్టుకుని తాను పనిచేస్తున్న సర్వీస్ సెంటరుకు గంగాధర్ తీసుకెళ్లాడు. కుమార్తెను పార్కింగ్ (parking) ఏరియాలో ఉంచి కుమారుడిని మాత్రం లోపలికి తీసుకెళ్లాడు. ప్రదీప్ అక్కడే ఆడుకుంటుండగా గంగాధర్ మాత్రం తన పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలోనే బాలుడు అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వస్తుండగా, ఒక్కసారిగా వీధి కుక్కలు వెంటపడ్డాయి.
దీంతో భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి అటూ ఇటూ పరుగెత్తాడు. కానీ, ఎంతకీవదలని శునకాలు మాత్రం ఒకదాని తర్వాత మరొకటి దాడి చేయడంతో ఆ బాలుడు కిందపడిపోయాడు. తమ్ముడు ఆర్త నాదాలు విన్న అక్క తండ్రికి విషయం చెప్పడంతో అతను పరుగెత్తుకుంటూ వచ్చి కుక్కలదాడిలో తీవ్రంగా గాయపడిన కుమారుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రదీప్ అప్పటికే మరణించినట్టు వైద్యులు (doctors) చెప్పడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి బస్తీల్లో వీధి కుక్కల బెడద పెరిగిపోతోంది. తాజాగా జరిగిన ఓ దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ ( hyderabad) నగరంలో జరిగింది. శునకాల దాడి నుంచి ఆ బాలుడు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరకు ప్రాణాలు వదిలాడు.