»Aditi Rao Hydari Dance With Boyfriend Siddharth Viral Video
Viral Video: బాయ్‌ఫ్రెండ్ సిద్ధార్థ్ తో అదితి రావ్ డాన్స్
ప్రముఖ నటి అదితి రావ్ హైదరీ, హీరో సిద్ధార్థ్ కలిసి ఓ వైరల్ పాటకు డాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు ప్రముఖులు ఆసక్తికరంగా కామెంట్లు చేశారు. అవెంటో తెలియాలంటే ఈ వార్తను చదవాల్సిందే.
స్టార్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ(Aditi Rao hydari), హీరో సిద్ధార్థ్(Siddharth)తో లవ్ లో ఉందని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియా(social media)లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మరోవైపు వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారని, త్వరలో పెళ్లి(marriage) కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత వీరిద్దరూ పలు చోట్ల ఫంక్షన్లలో కలిసి సందడి చేయడం సహా అనేక ఈవెంట్లకు కూడా హాజరయ్యారు. కానీ వారి రిలేషన్ షిప్ గురించి ఎక్కడా వీరిద్దరూ నోరువిప్పలేదు. ఈ క్రమంలో తాజాగా వీరూ వైరల్(viral) పాట(song) ”మాల టంటం మంజర టంటం”కు డాన్స్(dance) చేసిన వీడియోను వారి ఇన్ స్టా గ్రామ్(instagram) ఖాతాల్లో పోస్ట్ చేశారు. విశాల్(vishal) హీరోగా నటించిన ఎనిమీ చిత్రంలోని ఈ వైరల్ పాటకు వీరిద్దరూ స్టెప్పులేశారు. ఇది చూసిన పలువురు అభిమానులు క్లాప్స్ కోడుతుండగా…మరికొంత మంది వారి చేతులు చూడండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 4 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి.
వీడియోలో అదితి, సిద్ధార్థ్ వేసిన స్టెప్పులు(steps) సూపర్ అని ఇంకొంత మంది అంటున్నారు. “డ్యాన్స్ మంకీస్ – ది రీల్ డీల్” అని ఈ పోస్టుకు క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్టు చూసిన సోఫీ చౌదరి ఈ కోతులు చాలా అందంగా ఉన్నాయని తెలిపింది. దర్శకురాలు ఫరా ఖాన్, “మీరు తరచుగా ఇలానే డ్యాన్స్ చేయాలని రాసుకొచ్చింది. లవ్ లవ్ లవ్ ఈ కోతుల నుంచి మరింత ప్రేమ కావాలనుకుంటున్నానని నటి దియా మీర్జా(dia mirza) పేర్కొన్నారు. ఇది నాకు చాలా ఇష్టమైన సాంగ్ అంటూ నటి హన్సిక మోత్వానీ వీరిపై ప్రశంసలు కురిపించింది.
గతంలో అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్(Siddharth) లంచ్ డేట్లో కనిపించినప్పుడు వీరిద్దరి పెళ్లి గురించి పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. అంతకు ముందు సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా అదితి ఓ నోట్ రాసి ట్వీట్ చేసింది. అప్పుడు అదితి బీచ్‌లో సిద్ధార్థ్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు నా పిక్సీ బాయ్ అని వెల్లడించింది. అందుకు ఎల్లప్పుడు నువ్వే నా హృదయం ధన్యవాదాలు అంటూ సిద్ధార్థ్ రిప్లె ఇచ్చాడు. మరోవైపు ఇదివరకే అదితి రావ్ హైదరీ(Aditi Rao hydari) పుట్టినరోజు సందర్భంగా కూడా సిద్ధార్థ్ ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయపూర్వక చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ఆమెను “ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్” అని పిలుస్తూ, “హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్ డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్ అదితి రావ్ హైదరీ అని రాసుకొచ్చాడు.
ప్రస్తుతం అదితి రావ్ హైదరీ(Aditi Rao hydari) సంజయ్ లీలా భన్సాలీ ఆధ్వర్యంలో వస్తున్న హీరామండి(hira mandi) వెబ్ సిరీస్ లో నటిస్తుంది. దీంతోపాటు ఈ వెబ్ సిరీస్ లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్ కూడా నటించారు. ఇంకోవైపు అదితి రావు గాంధీ టాక్స్ అనే మూవీ ప్రాజెక్టుతోపాటు డివైడెడ్ మై బ్లడ్, జూబిలీ అనే వెబ్ సిరీస్ లలో యాక్ట్ చేస్తుంది. ఇక హీరో సిద్ధార్థ్ కమల్ హసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2(indian2)లో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.