సీఐఎస్ఎఫ్లో తొలిసారి పూర్తిస్థాయిలో మహిళల రిజర్వ్ బెటాలియన్ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. విమానాశ్రయాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో పెరుగుతున్న విధులను దృష్టిలో ఉంచుకుని దాదాపు 1000కిపైగా మహిళా సిబ్బందితో కూడిన రిజర్వ్ బెటాలియన్ను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.