ADB: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా, అధికారికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ 1, 2 తేదీలలో జిల్లాలోని అన్ని ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబు చేయాలని సూచించారు.