MDCL: కుత్బుల్లాపూర్ దుండిగల్ సర్కిల్ బరంపేట వార్డులో డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. నాలాలు, డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో డీసిల్టింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వర్షాకాలంలో ముంపు సమస్యలు రాకుండా పనులను మరింత వేగవంతం చేయాలని కోరారు.