టెక్నాలజీ వాడకం పెరిగేకొద్దీ సైబర్ నేరాలు(Cyber Crimes) కూడా పెరుగుతున్నాయి. గత కొంత కాలంగా సెలబ్రిటీల(Celebrities) పేరుతో మోసాలు జరుగుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా, టెలిగ్రామ్, యూట్యూబ్ వేదికగా అనేక సైబర్ నేరాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యాంకర్ శివజ్యోతి(Anchor Shiva Jyothi) పేరుతో ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. దాంతో ఆ వ్యక్తి శివజ్యోతికి సోషల్ మీడియా వేదికగా తన బాధను తెలిపాడు.

యాంకర్ శివజ్యోతి(Anchor Shiva Jyothi) అంటే తెలియనివారంటూ ఎవ్వరూ ఉండరు. తెలంగాణ యాసలో వార్తలు చెబుతూ సావిత్రిగా ఈ యాంకర్ బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్(Big Boss) షోలో అడుగుపెట్టి తెలుగు అభిమానులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే శివజ్యోతి(Shiva Jyothi) ఓ యూట్యూబ్ చానెల్ ను కూడా ప్రారంభించింది. అయితే ఆ యూట్యూబ్ ఛానెల్(Youtube Channel) పేరునే వాడుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారు.
హుస్సేస్ అనే వ్యక్తిని మోసం చేశారు. శివజ్యోతి(Shiva Jyothi) యూట్యూబ్ ఛానల్ నుంచి రివార్డ్సు వచ్చాయని టెలిగ్రామ్ లింక్ పెట్టారు. హుస్సేస్ ఆ మెస్సేజ్ ను నమ్మి లింక్ పై క్లిక్ చేశాడు. రివార్డ్స్ కావాలంటే రూ.1000 కట్టాలని ఉంది. వారు చెప్పినట్లుగానే డబ్బులు కట్టాడు. ఆ తర్వాత ఇంకో రూ.3 వేలు కట్టమన్నారు. హుస్సేస్ ఆ డబ్బులు కూడా పే చేశాడు. సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) ఇదే మంచి తరుణం అనుకుని రూ.6 వేలు కట్టమన్నారు. మోసాన్ని కనిపెట్టని హుస్సేన్ మళ్లీ రూ.6వేలు వారి ఖాతాకు బదిలీ చేశాడు.
ఆ తర్వాత సైబర్ నేరగాళ్ల(Cyber Criminals) నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో తన సెల్ నంబర్ ను యాంకర్ శివజ్యోతి(Anchor Shiva Jyothi)కి పంపి తన బాధను తెలిపాడు. దీనిపై శివజ్యోతి రియాక్ట్ అయ్యింది. ఇన్ స్టా వేదికగా శివజ్యోతి(Shiva Jyothi) కొన్ని మెస్సేజ్ లను షేర్ చేసింది. అభిమానులు అలాంటి వాటిని నమ్మకండని తెలిపింది. తనకు టెలిగ్రామ్ ఖాతానే లేదని తెలిపింది. సైబర్ నేరగాళ్ల(Cyber Criminals) పట్ల జాగ్రత్తగా ఉండాలని తన అభిమానులకు సూచించింది.