SSMB 28 : 'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి హ్యాట్రిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను స్టార్ట్ చేశారు.
‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి హ్యాట్రిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను స్టార్ట్ చేశారు.ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో మహేష్ బాబుతో పాటు హీరోయిన్లు కూడా జాయిన్ అయ్యారు. ఇంతకు ముందు జరిగిన షెడ్యూల్లో పూజా హెగ్డే మాత్రమే పాల్గొంది. ఇక ఇప్పుడు యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా జాయిన్ అవడంతో.. ముగ్గురిపై కొన్ని ముఖ్యమైన సన్ని వేశాలను తెరకెక్కిస్తున్నారు. దాంతో ఈ షెడ్యూల్ ఎంతో కీలకం అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో తాత పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుందట. అందుకోసం ప్రకాశ్ రాజ్‌ని రంగంలోకి దించుతున్నారని తెలుస్తోంది. గతంలో మహేష్‌కు విలన్‌గా నటించాడు ప్రకాష్ రాజ్. ఇక ఇప్పుడు తాతగా కనిపించబోతుండడం ఇంట్రెస్టింగ్గా మారింది. అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పడ్నేకర్‌ను కీలక పాత్రలో తీసుకున్నట్టు ప్రచారంలో ఉంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే లేడీ కానిస్టేబుల్ పాత్రలో భూమి పడ్నేకర్ కనిపించనుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయాల పై క్లారిటీ రానుందని అంటున్నారు. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘అలా వైకుంఠపురములో’ సినిమాల తర్వాత.. త్రివిక్రమ్‌తో కలిసి మరోసారి పని చేస్తున్నాడు సంగీత దర్శకుడు థమన్.