SSMB 28 : కొన్ని అప్డేట్స్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంటాయి. ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ ఎస్ఎస్ఎంబీ 28 కిక్‌లో ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు.
కొన్ని అప్డేట్స్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంటాయి. ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ ఎస్ఎస్ఎంబీ 28 కిక్‌లో ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఎలా అయితే పీక్స్‌కు తీసుకెళ్తాడో.. యాక్షన్‌ను కూడా అంతకుమించి అనేలా చూపిస్తాడు త్రివిక్రమ్. అందుకు ఉదాహరణగా అరవింద సమేతలోని ఎన్టీఆర్ ఎంట్రీ ఫైట్ ఒక్కటి చాలు. అలాంటిది మహేష్‌తో యాక్షన్ డోస్ పెంచుతున్నాడంటే.. ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక లేటెస్ట్ అప్డేట్ ఎస్ఎస్ఎంబీ 28పై మరింత హైప్ క్రియేట్ చేసేలా ఉంది. ఇప్పటి వరకు మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన సినిమాలు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. పూరి జగన్నాథ్ తెరకెక్కించినన ‘పోకిరి’ మూవీలో.. మహేష్ పవర్ ఫుల్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. అలాగే దూకుడు సినిమాలోను పోలీస్ ఆఫీసర్‌గా దుమ్ముదులిపేశాడు. కానీ ఆగడు మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే మళ్లీ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ అదరగొట్టేసింది. కాబటట్టి మహేష్ పోలీస్ డ్రెస్ వేసిన సినిమాల్లో.. సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. అది కూడా పోకిరి ఇండస్ట్రీ హిట్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలోను మహేష్ సూపర్ కాప్‌గా కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ కూడా ఇప్పటి వరకు కాప్ జోలికి వెళ్లలేదు. ఒకవేళ ఇదే నిజం అయితే.. మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడిపోయినట్టే. అయితే ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందో చూడాలి.